చైతు హీరోయిన్‌తో తేజ్ తమ్ముడు రొమాన్స్!!
on Nov 5, 2018
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. అతడెవరో కాదు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మరియు సుకుమార్ రైటింగ్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రంలో `సవ్యసాచి` లో హీరోయిన్ గా చైతుతో రొమాన్స్ చేసిన నిధి అగర్వాల్ వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. సవ్యసాచిలో నిధ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే నిధిని హీరోయిన్ గా మైత్రి మూవీస్ తీసుకున్నారట. సుకుమార్ దగ్గర చాలా సినిమాలకు అసిస్టెంట్ గా పని చేసిన బుచ్చిబాఉ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఇక వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
