హైకోర్టు సంచలన ఆదేశాలు.. ఓజీ, కాంతార సినిమాల పరిస్థితి ఏంటి?
on Sep 23, 2025

కర్ణాటకలో సినిమా టికెట్ ధరలను రూ.200కి పరిమితం చేసే నిబంధనను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధన వల్ల భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ.. ప్రొడ్యూసర్‌లు మరియు మల్టీప్లెక్స్ యజమానులు కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు, తాత్కాలికంగా ఈ నిబంధనను నిలిపివేసింది హైకోర్టు. త్వరలో విడుదల కానున్న బడా సినిమాలకు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు.
సినిమాని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేది ఉద్దేశంతోనే టికెట్ ధరల నిబంధనను తీసుకొచ్చినట్లు కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ నిబంధన వల్ల భారీ బడ్జెట్ సినిమాలు నష్టపోతాయని, భారీ సినిమాలు తీయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతుందని.. ప్రొడ్యూసర్‌లు, మల్టీప్లెక్స్ యజమానులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై కర్ణాటక హైకోర్టు తుది తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.
టికెట్ ధరలను రూ.200కి పరిమితం చేసే నిబంధనను హైకోర్టు తాత్కాలికంగా నిలిపి వేయడం.. రిలీజ్ కి రెడీ అయిన 'ఓజీ', 'కాంతార చాప్టర్ 1' వంటి సినిమాలకు రిలీఫ్ అని చెప్పొచ్చు. తెలుగు స్టార్స్ కి కర్ణాటకలో మంచి మార్కెట్ ఉంది. సెప్టెంబర్ 25న విడుదల కానున్న 'ఓజీ'పై టికెట్ రేట్ ప్రభావం పడుంటే.. కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. ఇక అక్టోబర్ 2న కన్నడ బిగ్ మూవీ 'కాంతార చాప్టర్ 1' విడుదలవుతోంది. ఈ సినిమాకి రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టే సత్తా ఉందని అందరూ నమ్ముతున్నారు. అయితే ప్రభత్వం తెచ్చిన టికెట్ రేట్ నిబంధన వల్ల.. కర్ణాటకలో కలెక్షన్లకు తీవ్ర గండి పడుతుందని 'కాంతార' నిర్మాతలు ఆందోళన చెందారు. ఇప్పుడు హైకోర్టు స్టేతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



