‘ఓజీ’కి పవన్‌కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
on Sep 23, 2025
ఇటీవలికాలంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఏ సినిమాకీ రాని హైప్ ‘ఓజీ’కి వచ్చింది. అంతకుముందు ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్‌లోనే పవర్‌స్టార్ చేసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి కూడా ఈ రేంజ్ బజ్ క్రియేట్ అయింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న పవన్.. భీమ్లానాయక్, వకీల్‌సాబ్, బ్రో చిత్రాలు చేశారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యే నాటికి హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలు కమిట్ అయి ఉన్నారు. పదవిలో కొనసాగుతూనే ఈ సినిమాలను పూర్తి చేసేందుకు టైమ్ కేటాయిస్తూ వచ్చారు పవన్. ఈ మూడు సినిమాల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న సినిమా మాత్రం ‘ఓజీ’నే.
పవన్‌కళ్యాణ్‌ని అతని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారు అనే దానికి చక్కని ఎగ్జాంపుల్‌గా ‘ఓజీ’ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి వీలైనంత హైప్ తీసుకొద్దామని ట్రై చేసినా అది వర్కవుట్ అవ్వదని ముందే డిసైడ్ అయినట్టుగా అనిపించింది. ఆ సినిమా విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో అందరి దృష్టీ ‘ఓజీ’పైనే పడింది. ప్రేక్షకులు, అభిమానులు సెప్టెంబర్ 25 కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్‌కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. 24న వేసే ప్రీమియర్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. గతంలో ఏ సినిమాలోనూ కనిపించని లుక్‌లో పవర్‌స్టార్ కనిపిస్తున్నారన్న ఒపీనియన్ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దీంతో ‘ఓజీ’ ఓపెనింగ్స్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
‘ఓజీ’ చిత్రానికి ప్రధాన ఆకర్షణ సినిమాలోని క్యాస్టింగ్. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ కనిపిస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, శ్రియారెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్.. ఇలా చాలా మంది నటీనటులు ఈ సినిమాలో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. అలాగే డిజె టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఒక స్పెషల్ సాంగ్‌లో కనువిందు చేయబోతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చ మొదలైంది. ఇంత భారీ క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌తోపాటు ఇతర నటీనటుల రెమ్యునరేషన్ ఎంత అనే డిస్కషన్ వాడిగా, వేడిగా జరుగుతోంది.
సోషల్ మీడియాలో రకరకాలుగా జరుగుతున్న డిస్కషన్స్‌లో విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం అంటూ ఈ సినిమాలోని ఆర్టిస్టుల రెమ్యునరేషన్లకు సంబంధించి కొన్ని ఫిగర్స్ వినిపిస్తున్నాయి. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం 100 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. అలాగే డైరెక్టర్ సుజిత్‌కి 8 కోట్ల వరకు ఇచ్చారని తెలుస్తోంది. హీరోయిన్ ప్రియాంక మోహన్ 2 కోట్లు, విలన్‌గా నటించిన బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ 5 కోట్లు అందుకున్నారట. ప్రకాష్‌రాజ్ 1.5 కోట్లు, శ్రియారెడ్డి 40 లక్షలు, అర్జున్ దాస్ 40 లక్షల తీసుకున్నట్లు సమాచారం. అలాగే సంగీత దర్శకుడు తమన్ 5 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. మిగతా నటీనటులు, టెక్నీషియన్లకు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందినట్లు సమాచారం. ఓవరాల్‌గా సినిమా బడ్జెట్ 250 కోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది. ఏ విధంగా చూసినా ఇది పవన్‌కళ్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాగా చెప్పొచ్చు. ‘ఓజీ’ చిత్రానికి ఇప్పుడున్న బజ్ చూస్తుంటే కలెక్షన్ల సునామీ సృష్టించే అవకాశం ఉందని, అప్పుడు ఈ రెమ్యునరేషన్లు, బడ్జెట్ చాలా చిన్న విషయంగా కనిపిస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదిలా ఉంటే.. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ‘ఓజీ’ 50 కోట్ల గ్రాస్ వసులు కలెక్ట్ చేసిందని చెబుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



