కళ్ళ ముందు కనపడుతుంది.. వార్ 2026 తప్పదా!
on Aug 22, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan),ఇళయదళపతి విజయ్(Ilayathalapathy VIjay).ఈ ఇద్దరు తమకున్న సినీ బ్యాక్ గ్రౌండ్ తోనే హీరోలుగా పరిచయమయ్యారు. కానీ తమదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, మేనరిజమ్స్, డాన్స్ లతో లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్నారు. ఎంతలా అంటే సొంతంగా రాజకీయపార్టీ స్థాపించేంతలా. ఈ ఇద్దరు తెలుగు, తమిళ సినీ రంగానికి చెందిన వారే అయినా, రెండు దశాబ్డలపై నుంచే సినిమాల పరంగా ఇద్దరి మధ్య మంచి అనుబందం ఉంది. విజయ్ తమిళంలో చేసిన 'ఖుషి', 'తిరుపాచి' వంటి సినిమాలని, పవన్ తెలుగులో రీమేక్ చేసి మంచి విజయాల్ని అందుకున్నాడు. ముఖ్యంగా పవన్ కెరీర్ లో 'ఖుషి' ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. పవన్, విజయ్ గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతు,ఒకరంటే ఒకరికి అభిమానమని చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఈ ఇద్దరు రాజకీయరంగంలో ప్రత్యర్థులుగా మారబోతున్నారే వార్తలు తెలుగు, తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా విజయ్ తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కజగం'(Tvk)కి సంబంధించిన సభని మదురైలో నిర్వహించడం జరిగింది. అందులో విజయ్ మాట్లాడుతు 'బీజెపి పార్టీ ఐడియాలజీకి నేను వ్యతిరేకం. బీజెపితో పొత్తు ఎప్పటికి ఉండదు. మోడీ(Narendra Modi)తమిళనాడుతో పాటు, తమిళనాడు లో ఉన్న ముస్లిమ్స్ పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఈ మాటలే పవన్ కళ్యాణ్, విజయ్ రాజకీయ యవనికపై ప్రత్యర్థులుగా మారే అవకాశమున్నట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. పవన్ రాజకీయపరంగా బిజెపి తో పొత్తులో ఉన్నాడు. అందులో భాగంగా ఎలక్షన్స్ జరుగుతున్న ప్రతి స్టేట్ కి బిజెపి తరుపున స్టార్ క్యాంపైనర్ గా వెళ్లి ప్రచారం చేస్తున్నాడు.
ఇటీవల తమిళనాడుకి చెందిన బిజెపి నాయకులు పవన్ తో పలు ధపాలుగా తమిళనాడులో బహిరంగ సభలని ఏర్పాటు చేసారు. ఆయా సభల్లో పవన్ స్పీచ్ తమిళనాడు బిజెపీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే మధ్య జరిగే తమిళనాడు సార్వ్రతిక ఎన్నికల్లో బిజెపి(Bjp)తరుపున పవన్ ప్రచారం గ్యారంటీ. పైగా మోడీ అంటే పవన్ కి వ్యక్తిగతంగా చాలా ఇష్టం. మోడీ లాంటి నాయకుడు దేశానికీ చాలా అవసరమని చెప్తూనే ఉన్నాడు. మరి విజయ్ తన మాటల్లో మోడీ, బీజెపి కి వ్యతిరేకమని స్పష్టంగా చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వార్ తప్పేలా లేదని సినీ, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



