ఘట్టమనేని వారసుడితో రవీనా టాండన్ కుమార్తె!
on Aug 22, 2025
చిత్ర పరిశ్రమలో వారసత్వం అనేది ఎప్పటి నుంచో ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వారసులు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలా వచ్చిన వారిలో హీరోలే ఎక్కువగా కనిపిస్తారు. టాలీవుడ్‌ని తీసుకుంటే సినీ ప్రముఖుల కుమార్తెలు హీరోయిన్లు పరిచయమైన సందర్భాలు చాలా తక్కువ. ఈ విషయంలో బాలీవుడ్ చాలా ముందుంది. బాలీవుడ్ ప్రముఖుల కుమార్తెలు ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయమై విజయాలు సాధించారు. ఇప్పుడు ఆ కోవలోనే స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ‘ఆజాద్’ చిత్రంలో ఓ హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది.
తాజా సమాచారం మేరకు.. సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ హీరోగా నటించే చిత్రంలో రాషా తడానికి హీరోయిన్‌గా ఛాన్స్ లభించిందని తెలుస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. రాషా తడాని బాలీవుడ్‌లో సినిమా చెయ్యక ముందే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని గతంలో వార్తలు వచ్చాయి. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రంలో మొదట రాషాను హీరోయిన్‌గా బుక్ చేసుకున్నారని, ఆ సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోందని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమాలో జాన్వీకపూర్‌ను హీరోయిన్‌గా తీసుకున్న విషయం తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్‌వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ తొలి సినిమా ఉంటుందని ఆమధ్య ఎనౌన్స్ చేశారు. అంతేకాదు, ఈ సినిమాలో మోక్షజ్ఞ సరసన రాషా తడాని హీరోయిన్‌గా నటించబోతోందని చెప్పుకున్నారు. చివరికి వారి కాంబినేషన్‌లో సినిమాయే లేదని తేలింది. జయకృష్ణ హీరోగా నటించే సినిమాలో రాషా హీరోయిన్‌గా నటించబోతోందని వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది అధికారిక ప్రకటన వస్తేనేగానీ తెలీదు. రవీనా టాండన్ బాలీవుడ్‌లోనే కాదు, సౌత్‌లోనూ కొన్ని సినిమాల్లో నటించారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బంగారు బుల్లోడు చిత్రం హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరు తెచ్చింది. అందం విషయంలో తల్లిని మించేలా ఉన్న రాషా.. హీరోయిన్‌గా ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



