సంపూర్ణేష్ బాబుపై బేబీ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు..సిద్ధిపేట వాళ్ళు వింటే ఏంటి నీ పరిస్థితి
on Apr 11, 2025
'బేబీ'(baby)మూవీతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ పొందిన దర్శకుడు సాయిరాజేష్(sai Rajesh).రీసెంట్ గా ఆయన సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu)ప్రచి బన్సాల్, ఆర్తి వర్మ,బాబుమోహన్ ముఖ్య పాత్రలు పోషించిన'సోదర'మూవీట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు,తనకీ మధ్య ఉన్న అనుబంధం గురించి సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు.
నా ఫస్ట్ మూవీ హృదయకాలేయంకి కన్నడ హీరో ఉపేంద్ర(Upendra)గారు 'A'సినిమాలో వేసుకునే గెటప్ లాంటి హీరో కావాలి.అదే గెటప్ తో సంపు ప్రసాద్ ల్యాబ్ లో కనపడగానే నాకు హీరో దొరికాడని అనుకున్నాను.సంపు సిద్ధిపేటలో ఉండేవాడు.రోజు అక్కడుంచి వస్తే ఇద్దరం కలిసి ఇందిరా పార్క్ లోనో, ప్రసాద్ ల్యాబ్ గడ్డిలోనో కూర్చొని స్టోరీ డిస్కర్షన్ చేసే వాళ్ళం.డిస్కర్షన్ అవ్వగానే సంపు ని ఎంజీబిఎస్ కి తీసుకెళ్లి సిద్ధిపేట(Siddipet)బస్సు ఎక్కించే వాడ్ని. సంపు దగ్గర డబ్బులు ఉండేవి కావు.దాంతో నాకున్న 500 రూపాయలలో 200 ఇచ్చేవాడ్ని.ఒకసారి నేను ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడం కుదరలేదు.కృష్ణానగర్ లో100 రూపాయలకి మడత మంచం అద్దెకి తీసుకొని పడుకునే వాడు.ఆ తర్వాత ఎలాగోలా మా దగ్గర డబ్బులు లేకపోయినా 'హృదయం కాలేయం' తెరకెక్కించాం.మూవీ సూపర్ హిట్ అయ్యింది.కానీ నాకేమో ఎవరు డబ్బులు ఇవ్వలేదు.సంపు కి మాత్రం నెక్స్ట్ సినిమాల కోసం లక్షల లక్షల డబ్బులు అడ్వాన్స్ కింద ఇచ్చారు.
నేనేమో సింగల్ బెడ్ రూమ్ లో ఉంటే సంపు సిద్ధిపేట లో నాలుగంతస్థుల ఇల్లు కట్టాడు.క్రెడిర్ కార్డు పెట్టి నేను నానో కారు కొనుక్కుంటే సంపు 'ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కార్' కొన్నాడు.ఆ తర్వాత మా ఇద్దరి కాంబోలో తెరకెక్కిన మరో మూవీ 'కొబ్బరిమట్ట'మూవీ షూటింగ్ లేట్ అవుతు వస్తుంది.దాంతో 'సంపు'కి నేను ఫైనాన్షియల్ గా వీక్ గా ఉన్నానని అర్థమైంది.ఒక సినిమా ఒప్పుకొని ఆరులక్షలతో హోండా కారు కొనిపెట్టాడు.నాకు సొంత ఇల్లు లేకపోవడంతో 2018 లో మణికొండలో నాకు కూడా తెలియకుండానే అపార్ట్ మెంట్ బిల్డర్ దగ్గరకి వెళ్లి 12 లక్షల రూపాయలు కట్టాడు.ఆ తర్వాత నా దగ్గరకొచ్చి ఇంకో పదమూడు నువ్వు కట్టాలి.లేదంటే 12 పోతాయని చెప్పాడు.ఇప్పుడు ఆ ఇల్లుఎన్నో రేట్లు పెరిగింధి.సినిమా ఇండస్ట్రీ లో చిన్నోడు,పెద్దోడు ఉండడు.నాకు బేబీ వచ్చి కొద్దిగా లేచాను. సంపు ఇప్పుడు డౌన్ లో ఉన్నాడు.మళ్ళీ లేస్తాడు. సినిమా ఎప్పుడు ఎవర్ని ఎక్కడకి తీసుకెళ్తుందో చెప్పలేం అని సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
