'హరి హర వీరమల్లు' వాయిదా.. మేకర్స్ కీలక ప్రకటన!
on Apr 11, 2025
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu). పవన్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా పలుసార్లు వాయిదా పడింది. మే 9న విడుదల కావాల్సి ఉండగా, మరోసారి వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక ప్రకటన చేశారు.
'హరి హర వీరమల్లు' షూటింగ్ దాదాపు పూర్తయింది. పవన్ నాలుగైదు రోజులు డేట్స్ కేటాయిస్తే మొత్తం సినిమా కంప్లీట్ అయిపోతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న పవన్.. ఈ నెలలో ఎలాగైనా వీరమల్లుకి కాస్త సమయం కేటాయించి, చిత్రాన్ని పూర్తి చేయాలని భావించారు. అయితే రీసెంట్ గా సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. దీంతో పవన్ సింగపూర్ వెళ్ళారు. ప్రస్తుత పరిస్థితుల్లో 'హరి హర వీరమల్లు' సినిమాకి పవన్ సమయం కేటాయించే పరిస్థితి లేదని, ఈ సినిమా మళ్ళీ వాయిదా పడినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అభిమానులు సైతం వాయిదా పడుతుందనే అభిప్రాయానికి వచ్చేశారు. ఈ క్రమంలో మేకర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. వీరమల్లు మే 9నే విడుదలవుతుందని స్పష్టం చేశారు. చిత్ర నిర్మాణం తుదిదశకు చేరుకుందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేంగా జరుగుతున్నాయని.. మే 9న సినిమాని భారీస్థాయిలో విడుదల చేయనున్నామని తెలిపారు. తాజాగా ప్రకటనతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకులు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్, విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
