సూపర్ స్టార్ కాదంట ఐకాన్ సార్ అంటున్నారు!
on Feb 10, 2023

ప్రస్తుతం గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌లో వినరో భాగ్యము విష్ణు కథ అనే చిత్రం రూపొందుతోంది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిత్తమైన ఈ చిత్రం ఫిబ్రవరి 17న థియేటర్లోకి వస్తుంది. ఈ చిత్రంపై నెటిజన్ల దృష్టిపడింది. దాంతో వారు ఈ సినిమాను ఒక రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. ప్రతి హీరో ప్రతి మేకర్ టీజర్ ట్రైలర్లలో ఏమాత్రం తప్పులు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. టీజర్ ట్రైలర్ ఎలాంటి తప్పులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినా కూడా ఒక్కోసారి మాత్రం అడ్డంగా బుక్కైపోతున్నారు. దాంతో ట్రోల్స్ కి గురవుతున్నారు. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కదా టీం నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయింది.
మురళీ కిషోర్ అబ్బూరు ఈ మూవీ ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రచార చిత్రాలకు మంచి బజ్ క్రియేట్ అయింది. రాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎండింగ్లో కిరణ్ అబ్బవరం ఓ డైలాగ్ చెప్పాడు. మనకు కష్టం వస్తే ఎవరో సాయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలుసు నీ పక్క నెంబర్ సిఎంతో పీఎం తో సచ్చిన్ దో, ధోనిదో, పవర్ స్టార్దో, ఐకాన్ స్టార్ దో, రెబల్ స్టార్ లో... అనే డైలాగ్ చెప్పించారు. అయితే లిప్ నింపు సింక్ లో మాత్రం సూపర్ స్టార్ అని అబ్బవరం పలుకుతుంటే దాని కాస్త ఐకాన్ స్టార్ గా మార్చి చెప్పించారు. ఇదే ఇప్పుడు నెటిజన్ల ట్రోల్ కి గురయ్యాలా చేస్తుంది. కిరణ్ అబ్బవరంసూపర్ స్టార్ అని చెప్పి డైలాగుని డబ్బింగ్ వచ్చేసరికి ఐకాన్ స్టార్ అంటూ కవర్ చేశారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. దీంతో ఐకాన్ స్టార్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా వారు మొదలైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



