శృతి తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చింది!
on Feb 10, 2023
.webp)
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గారాల పట్టి శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె మల్టీ టాలెంటెడ్ సింగర్, మ్యూజిక్ కంపోజర్, రైటర్, యాక్టర్. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంక్రాంతికి తెలుగులో ఆమెకు రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలలో నటించి విజయాలను అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఖుషి గా ఉంది. తాజాగా ఆమె మాట్లాడుతూ ఒక నటి నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం రెండు సూపర్ హిట్ గా నిలవడం చాలా అరుదుగా జరుగుతుంది అని తెలిపింది.
బాలీవుడ్ లో తను నటించిన లక్ సినిమా విడుదలై 14 ఏళ్లయిన సందర్భంగా హర్షం వ్యక్తం చేసింది. నేను సినీ పరిశ్రమ లోకి వచ్చినప్పుడు నా సింగింగ్ గురించి ఎక్కడ మాట్లాడవద్దని చెప్పేవారు. అలా చేస్తే సినిమాలపై ప్రభావం పడుతుంది అనేవారు. నేను రెండింటికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగాను. నేను మొదటిసారి మైకు ముందు పాడిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆరోజు మా నాన్న నేను ఎలా పాడతానోనని భయపడ్డారు.
ఇక కోవిడ్ సమయంలో నేను నా కళను ఎంతో మెరుగుపరుచుకున్నాను. ఆ తర్వాత స్టేజి షోలలో పాల్గొన్నాను. ప్రేక్షకుల స్పందనను ప్రత్యక్షంగా చూశాను. చాలా ఆనందమేసింది. పాట రాయగలగడం దేవుడిచ్చిన గొప్ప బహుమతి. మిగతా ప్రపంచం తో దానిని పంచుకోవడం అదనపు వరం అని శ్రుతి తెలిపింది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సినిమాలతో అలరిస్తోంది ఇక ఈమె డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజారికా తో సహజీవనం చేస్తోంది. వీరి లవ్ స్టోరీ ఓపెన్ సీక్రెట్ అన్న విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



