యావరేజ్ అమ్మాయి విలువ కరువులో ఉన్నోడికే తెలుస్తుంది!
on Jul 10, 2022

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
'నేను మీకు బాగా కావాల్సినవాడిని' టీజర్ కిరణ్ గత చిత్రాల తరహాలోనే నవ్వులు పంచుతూ ఆహ్లదకరంగా సాగింది. ఇందులో డ్రైవర్ గా కనిపిస్తున్న కిరణ్ "తింగరి నా కొడుకులు అందరూ నాకే తగులుతారు" అంటూ ఫ్రస్ట్రేట్ అవ్వడం ఆకట్టుకుంది. "అంత ఆహ్లాదకరమైన కుటుంబం మీకున్నప్పుడు.. అందరూ కలిసి సరదాగా ఉగాది పచ్చడి తినకుండా.. ఇంత దూరం వచ్చి, ఇంతలా ఎందుకు తాగుతున్నారు మేడం", "ఒక్క ప్రేమకే మీరిలా అయిపోతే ఎలా?.. పదిసార్లు ప్రేమలో ఓడిపోయినా సరే, సిగ్గులేకుండా పదకొండో ప్రేమ కోసం పరితపించే ప్రేమికుల మధ్యలో బ్రతుకుతున్నాం", "యావరేజ్ గా ఉన్న అమ్మాయిల విలువ నాలాగా కరువులో ఉన్నోళ్ళకి తెలుస్తుంది గానీ నీలాగా కడుపు నిండిపోయినోళ్లకు ఏం తెలుస్తుంది మామ" అంటూ కిరణ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక కొరియోగ్రాఫర్ బాబా మాస్టర్ ఇందులో కిరణ్ కి మామగా కనిపించడం విశేషం. ఈ ఇద్దరి కలయికలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి టీజర్ కామెడీ, రొమాన్స్, యాక్షన్ సన్నివేశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ లా ఉంది.
కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కోడి దివ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రాజ్ నల్లి, ఎడిటర్ గా ప్రవీణ్ పూడి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



