ENGLISH | TELUGU  

రానా, ఇలియానా నేను-నా రాక్షసి ఏప్రెల్ 29 న

on Mar 24, 2011

rana wallpapers, rana stills, rana pics, rana photos, rana pictures, rana imagesరానా, ఇలియానా నేను-నా రాక్షసి ఏప్రెల్ 29 న విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై, యువ హీరో రానా హీరోగా, నలక నడుము అందాల గోవాభామ ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు బుజ్జి (శ్రీనివాస్) నిర్మిస్తున్న చిత్రం "నేను- నా రాక్షసి". ఈ చిత్రం దాదాపు చిత్రీకరణంతా పూర్తయ్యే స్థితిలో ఉంది. ఈ చిత్రాన్ని రానున్న వేసవి శలవుల్లో, ఏప్రెల్ 29 వ తేదీన విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాత నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ అంటున్నాయి.

అప్పటికి యన్ టి ఆర్ "శక్తి", ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్", పవన్ కళ్యాణ్ "తీన్ మార్" చిత్రాలు విడుదలవుతాయి. అల్లు అర్జున్ "బద్రీనాథ్" మే 19 వ తేదీన కనక "నేను-నా రాక్షసి" చిత్రానికి పెద్ద చిత్రాలేవీ అడ్డంకిగా మారవు. కనుక ఈ రానా, ఇలియానా "నేను-నా రాక్షసి" చిత్రాన్నిఏప్రెల్ 29 వ తేదీన విడుదల చేయటానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని సినీ జనాలనుకుంటున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.