రామ్ చరణ్ హీరోయిన్ దర్శకురాలిగా మారనుందా!
on Aug 20, 2025

సిల్వర్ స్క్రీన్ పై ఎంతో మంది మహిళా దర్శకులు విభిన్న చిత్రాలని తెరకెక్కించి ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నారు. కానీ హీరోయిన్ గా సక్సెస్ ని అందుకొని, కొంత గ్యాప్ తర్వాత దర్శకురాలిగా మారడం అనేది చాలా అరుదు. గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)సిల్వర్ స్క్రీన్ పై హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం చిరుత(Chirutha). ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన భామ 'నేహాశర్మ'(Neha Sharma). తొలి చిత్రంతోనే మంచి నటిగా ప్రూవ్ చేసుకొని, ఆ తర్వాత కుర్రోడు చిత్రంలో వరుణ్ సందేశ్ తో జత కట్టింది.
ఇప్పుడు నేహాశర్మ దర్శకురాలిగా మారనున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్(Ajay Devgn)నిర్మాణ సారధ్యంలో సదరు చిత్రం తెరకెక్కబోతుందని, సిద్దాంత్ చతుర్వేది(Siddhant Chaturvedi),మోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారనే చర్చ జోరుగానే నడుస్తుంది. 1945 వ సంవత్సరం నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్టుగా టాక్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే రానుందని అంటున్నారు.
చిరుత, కుర్రోడు చిత్రాల తర్వాత నేహాశర్మ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు పొందింది. తమిళ, మలయాళ, పంజాబీ భాషల్లో సుమారు పదిహేను చిత్రాల వరకు చేసిన నేహా, నాచురల్ స్టార్ నాని(Nani),మృణాల్ ఠాకూర్(Mrunal thakur)జంటగా వచ్చిన 'హాయ్ నాన్న' లో క్యామియో రోల్ లో కనిపించింది. సోలో హీరోయిన్ గా 2023 లో నవాజుద్దీన్ సిద్ధికి తో కలిసి 'జోగిరా సరా రా రా' అనే చిత్రంలో చేసింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



