ఓటీటీలో 'హరి హర వీరమల్లు' కొత్త వెర్షన్.. ఇది ముందే చేయొచ్చు కదా!
on Aug 20, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ 'హరి హర వీరమల్లు'. జులై 24న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం.. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా సెకండాఫ్.. అందునా వీఎఫ్ఎక్స్ సీన్స్ పై నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. దీంతో థియేటర్లలో ప్రదర్శితమవుతుండగానే కొన్ని సీన్లను ట్రిమ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఓటీటీలో మరో కొత్త వెర్షన్ దర్శనమిచ్చింది. (Hari Hara Veera Mallu)
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు(ఆగస్టు 20) నుంచి 'హరి హర వీరమల్లు' స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్ వెర్షన్ తో పోలిస్తే ఓటీటీ వెర్షన్ లో పది నిమిషాలకు పైగా ట్రిమ్ చేశారు. ఇప్పటికే గుర్రపు స్వారీ సన్నివేశాలను ట్రిమ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు క్లైమాక్స్ లోనూ మార్పులు చేశారు.
థియేటర్లలో విడుదలైన సమయంలో 'హరి హర వీరమల్లు' క్లైమాక్స్ మెప్పించలేకపోయిందనే కామెంట్స్ వచ్చాయి. దానిని దృష్టిలో పెట్టుకున్న మేకర్స్.. క్లైమాక్ సీన్స్ లో మార్పులు చేశారు. ప్రీ క్లైమాక్స్ ఫైట్ తర్వాత తుఫాన్ ఎపిసోడ్ ని తొలగించి.. డైరెక్ట్ గా పార్ట్-2 కి లీడ్ ఇచ్చారు. మరికొన్ని సీన్స్ ని కూడా ట్రిమ్ చేశారు.
ఓటీటీలో 'హరి హర వీరమల్లు' కొత్త వెర్షన్ చూసిన తర్వాత మెజారిటీ అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇదేదో ముందే చేసుంటే.. థియేటర్లలో సినిమా కాస్త బెటర్ గా పర్ఫామ్ చేసేదని అభిప్రాయపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



