హిట్ 3 విజయం నానిది కాదంట.. పవన్ కళ్యాణ్ కి థాంక్స్
on May 2, 2025

నాచురల్ స్టార్ 'నాని'(Nani)నిన్న మే 1 న వరల్డ్ వైడ్ గా 'హిట్ 3'(Hit 3)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి ఆట నుంచే హిట్ 3 పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటుగా, నాని పెర్ ఫార్మెన్స్ కి ప్రతి ఒక్క ప్రేక్షకుడు మెస్మరైజ్ అవుతున్నాడని, నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా హిట్ 3 దూసుకెళ్లబోతుందని ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు.
మూవీ సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర యూనిట్ 'దిల్ రాజు'(Dil Raju)తో కలిసి సక్సెస్ మీట్ ని నిర్వహించింది. అందులో నాని మాట్లాడుతు హిట్ 3 ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం నాది కాదు తెలుగు సినిమాది. రాబోయే రోజుల్లో వచ్చే సినిమాలు కూడా విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. టికెట్ రేట్స్ ని పెంచుకునేలా ఏపి(Ap)లో అనుమతి ఇచ్చిన సిఎం చంద్రబాబు నాయుడు గారికి(Chandrababi Naidu)డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)గారికి థాంక్స్ అని కూడా నాని చెప్పుకొచ్చాడు.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ 3 లో 'శ్రీనిధిశెట్టి'(Srinidhi Shetty)హీరోయిన్ గా చెయ్యగా సూర్య శ్రీనివాస్, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాధ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, యునానమిస్ ప్రొడక్షన్స్ పై నాని, ప్రశాంతి తిప్పరనేని నిర్మించగా మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



