తెలుగు అవార్డు ఫంక్షన్లు, ఫ్యాన్ వార్లపై నాని సెటైర్లు
on Mar 28, 2017

వివాదాలకు ఆమడ దూరంలో ఉండే నాని మొదటిసారి సంచలనకర వ్యాఖ్యలు చేసాడు. పోయిన సంవత్సరం ప్రేక్షకుడిగా చుసిన ఐఫా అవార్డు ఫంక్షన్ కి ఈ సారి నాని, రానా దగ్గుబాటి తో కలిసి హోస్ట్ చేయనున్నారు. ఇది ప్రకటిస్తున్న సమయంలో నాని ఎందుకో కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేసాడు. అది తమ ప్రోగ్రాం ని ప్రమోట్ చేయడానికా లేక మనసు లోతుల్లోంచి వచ్చిన వ్యాఖ్యలా అర్ధం కాలేదు. "తెలుగు అవార్డు ఫంక్షన్లంటే కొంచెం పొలిటికల్ ఫంక్షన్లలాగా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. అంటే ఒక ఫార్మటు లాగ, పొగడ్తలు గట్రా ఉంటాయి.
అయితే, మేమిద్దరం కలిసి ఆ ఫార్మటు ని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాం, అని చెప్పారు. అంతటితో ఆగకుండా, ఈ ఫంక్షన్ రెగ్యులర్ గా కాకుండా ఒక కాలేజ్ లో చేసే ఈవెంట్ లాగ ఉండబోతుంది. ఒకటి మాత్రం చెప్పగలను, ఇలా చేయడం వల్ల అక్కడ ఫాన్స్ వార్స్ కి తావుండదు, అని ఈ సారి ఐఫా అవార్డు ఫంక్షన్ ఎలా ఉండబోతుందో వివరించారు. "ఈ ప్రాసెస్ లో ఎవరికైనా ఇబ్బందికలిగితే క్షమించమని ముందుగానే కోరుతున్నాం," అని నవ్వుతూ కొందరికి ఇబ్బంది కలిగే ఆస్కారం ఉంటుందని చెప్పకనే చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



