చరణ్ మిస్ చేసుకున్నాడు, కానీ పవన్ చేయట్లేదు
on Mar 28, 2017

ఆది పినిశెట్టి తెలుగులో హీరోగా అడపాదడపా సినిమాలు చేసినా, అల్లు అర్జున్ సరైనోడు లో చేసిన విలన్ పాత్రకి విశేషమైన ప్రశంసలు అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఆదికి పెద్ద ఆఫర్లు చాలానే వచ్చాయి. కొన్ని ఒప్పుకున్నా, మరి కొన్ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఒకటి. చరణ్ సినిమా నిర్మాతలు ఆదిని ఒక ముఖ్యమైన పాత్రకి అడిగితే, డేట్స్ అడ్జస్ట్ చేయలేక వద్దనుకున్నారు. ఒకవేళ షెడ్యూల్ లో మార్పులు చేసుకునే పరిస్థితులుంటే సినిమా చేయడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్పినా, నిర్మాతలు అందుకు అంగీకరించకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ వదిలేయాల్సి వచ్చింది.
అయితే, ఆది చరణ్ సినిమా వదులుకోవడం ఏంటో గాని, అంతకు మించిన అదృష్టం కలిసొచ్చింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్న తన తదుపరి చిత్రంలో ఆది ని మెయిన్ విలన్ క్యారెక్టర్ కి అడిగారని తెలిసింది. అనుకోని అదృష్టం ఎదురవడంతో, ఎగిరి గంతేసి మరీ ఒప్పుకున్నాడంట ఆది. ఎవరు మాత్రం పవన్ కళ్యాణ్, అందులోను త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాని వదులుకుంటారు చెప్పండి. వచ్చే నెల 3 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. కీర్తి సురేష్, అను ఎమాన్యూల్ కథానాయికలు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



