`శ్యామ్ సింగ రాయ్`.. క్రిస్మస్ సెంటిమెంట్ ప్లస్సయేనా!
on Oct 18, 2021
`గ్యాంగ్ లీడర్`, `వి`, `టక్ జగదీష్` వంటి హ్యాట్రిక్ ఫ్లాప్స్ తరువాత నేచురల్ స్టార్ నాని నుంచి రాబోతున్న చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. ఇందులో శ్యామ్ సింగ రాయ్ గా, వాసుగా ద్విపాత్రాభినయం చేశాడు నాని. అతనికి జోడీగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ నటించిన ఈ చిత్రానికి `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ పిరియడ్ డ్రామా.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ రిలీజ్ కానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. నాని, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం `ఎంసీఎ` (2017) కూడా నాలుగేళ్ళ క్రితం ఇదే క్రిస్మస్ సీజన్ లో డిసెంబర్ 21న సందడి చేసింది. మిశ్రమ స్పందన తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి.. క్రిస్మస్ సెంటిమెంట్ రిపీట్ అయి.. నాని, సాయి పల్లవి కాంబోలో సెకండ్ హిట్ గా `శ్యామ్ సింగ రాయ్` నిలుస్తుందేమో చూడాలి. అలాగే, నాని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడా అన్నది కూడా ఆసక్తికరమే.
కాగా, కలకత్తా నేపథ్యంలో సాగే `శ్యామ్ సింగ రాయ్`కి మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
