దర్శకుడిగా నందమూరి బాలకృష్ణ?
on Dec 19, 2019

నటసింహం నందమూరి బాలకృష్ణ సకల కళా వల్లభుడు. ఆయనకు తెలుగు భాష మీద మంచి పట్టుకుంది. ముఖ్యంగా పురాణాలు, చరిత్రపై చక్కటి అవగాహన ఉంది. అలాగే, సినిమాలో 24 శాఖలపై కూడా. చాలా సార్లు అవలీలగా బోలెడు విషయాలపై మాట్లాడుతుంటారు. కథానాయకుడిగా తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన బాలకృష్ణ, త్వరలో దర్శకుడిగా మారుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నటనలో నట సార్వభౌమ నందమూరి తారక రామారావుకు తగ్గ తనయుడిగా నిరూపించుకున్న బాలకృష్ణ, త్వరలో దర్శకుడిగానూ నిరూపించుకుంటాడని తెలుస్తోంది.
ఎప్పటినుండో 'ఆదిత్య 369'కి సీక్వెల్ 'ఆదిత్య 999' చేయాలని బాలకృష్ణ అనుకుంటున్నారు. అసలు, వందో సినిమాగా 'ఆదిత్య 999' చేయాలనుకున్నారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో చర్చలు జరిగాయి. కానీ, ఎందుకో ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. ఈలోపు 'గౌతమిపుత్ర శాతకర్ణి' వచ్చింది. అయితే, ఇప్పుడు 'ఆదిత్య 999' చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారట. దాంతో ఆయన దర్శకుడు మారతారని టాక్. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



