ENGLISH | TELUGU  

సర్ ప్రైజ్.. 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తున్నారు!

on Feb 8, 2026

 

2027 సంక్రాంతి రసవత్తరంగా మారేలా ఉంది. 'మెగా 158'తో చిరంజీవి, 'NBK 111'తో బాలకృష్ణ, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ తో వెంకటేష్ వచ్చే సంక్రాంతికి రావడానికి సన్నాహాలు చేస్తుంటే.. నాగార్జున(Nagarjuna) ఏకంగా విడుదల తేదీని అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశాడు.

 

నాగార్జున తన 100వ సినిమాను రా కార్తీక్ దర్శకత్వంలో చేస్తున్నాడు. 'లాటరీ కింగ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. (Nag 100)

 

ఇక నాగార్జున తన 101వ చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో చేయనున్నాడు. వీరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా' 2016 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా వచ్చిన 'బంగార్రాజు' 2022 సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. 2027 సంక్రాంతికి కూడా ముచ్చటగా మూడోసారి సోగ్గాడే సీక్వెల్ తో రాబోతున్నారు. (Nag 101)

 

ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా తెలపడం విశేషం. "వాసివాడి తస్సాదియ్యా.. వచ్చే 15th జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ గా ఉంటాది కదా.. డేట్ మార్క్ చేసుకోండి" అంటూ ట్వీట్ చేసింది.

 

మొత్తానికి 2027 సంక్రాంతికి నాగార్జున కర్చీఫ్ వేశాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కూడా బరిలో దిగితే.. టాలీవుడ్ కి ఫోర్ పిల్లర్స్ లాంటి సీనియర్ స్టార్స్ బాక్సాఫీస్ వార్ కి దిగినట్టు అవుతుంది.

 

ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ సైతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్న సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.