వాలెంటైన్స్ డే స్పెషల్ గా 'మనసంతా నువ్వే' రీ రిలీజ్!
on Feb 8, 2026

లవ్ బాయ్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు ఉదయ్ కిరణ్(Uday Kiran). ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలలో 'మనసంతా నువ్వే'(Manasantha Nuvve) ఒకటి. 2001లో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమా, ఈ ఏడాది 25 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న రీ రిలీజ్ చేస్తున్నారు.
ఉదయ్ కిరణ్, రీమాసేన్, తనూరాయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సున్నితమైన ప్రేమకథా చిత్రానికి వీఎన్ ఆదిత్య తొలిసారి దర్శకత్వం వహించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ పై ఎమ్.ఎస్.రాజు నిర్మించిన ఈ మూవీ 2001లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
పాతికేళ్ల తర్వాత ప్రైమ్ షో నిరంజన్ రెడ్డి, చైతన్యారెడ్డి, శ్రీ మాత క్రియేషన్స్ పై రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఈ నెల 14వ తేదీన, వాలెంటైన్స్ డే సందర్భంగా మరలా థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ జనరేషన్ యూత్ కూడా ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



