వర్మ దర్శకత్వంలో చైతు సినిమా
on Oct 4, 2013
నాగచైతన్య హీరోగా మరో చిత్రం తెరకెక్కనుంది. "స్వామి రారా" చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న సుదీర్ వర్మ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రై.లిమిటెడ్ బ్యానర్ లో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య "ఆటోనగర్ సూర్య", "మనం" చిత్రాలతో బిజీగా ఉన్నాడు.