విఎఫ్ఎక్స్ లో గడ్డం తీసేస్తామన్నారు.. ఆ సినిమా తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు
on Oct 6, 2025

యువసామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya)'తండేల్' తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. చైతన్య కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా కూడా తండేల్ నిలిచింది. పైగా తన గత చిత్రాల కంటే తండేల్ లో నటన పరంగా, యాక్షన్ సీక్వెన్స్ లోను చైతన్య విజృంభించి నటించాడు. ప్రస్తుతం చైతన్య 'విరూపాక్ష' మూవీ ఫేమ్ 'కార్తీక్ దండు'(Karthik Dandu)దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్ని చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ 'మైథలాజికల్ థ్రిల్లర్' గా తెరకెక్కుతుండటంతో, చైతన్య క్యారక్టర్ ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఏర్పడింది.
రీసెంట్ గా చైతన్య ప్రముఖ ఓటిటి సంస్థ 'జీ 5'(Zee 5)వేదికగా జగపతిబాబు వ్యాఖ్యాతగా స్ట్రీమింగ్ అవుతున్న 'జయమ్మునిశ్చయమ్మురా'(Jayammu Nischayammuraa)టాక్ షో కి గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతు 'మహానటి'(Mahanati)మూవీలో తాత గారి క్యారక్టర్ చేయకుండా ఉండటానికి ఎన్నోసార్లు ట్రై చేశాను. ఎందుకంటే నేను తాత గారిలా నటించి మెప్పించడం అనేది అసాధ్యం. దీంతో నేను తాత గారి క్యారక్టర్ లో చెయ్యడం అనేది మర్చిపోండని నాగ్ అశ్విన్ కి చాలా సార్లు చెప్పాను. పైగా ఆ సమయంలో 'సవ్యసాచి' షూటింగ్ జరుగుతుంది. అందులోని క్యారక్టర్ కోసం గడ్డం పెంచాను. దీంతో లుక్ విషయంలో కూడా తాత గారి క్యారక్టర్ లో చేయడం కుదరని చెప్పాను. విఎఫ్ఎక్స్ లో గడ్డం తీసేస్తాను. ఈ క్యారక్టర్ లో నువ్వు మాత్రమే చేయాలనీ నాగ్ అశ్విన్ పట్టుబట్టాడని చైతన్య చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు అభిమానులతో పాటుప్రేక్షకుల్లోను ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మహానటి సావిత్రి(Savithri)గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో నాగ చైతన్య తన తాత నాగేశ్వరరావు(ANR)గారి క్యారక్టర్ ని అధ్బుతంగా పోషించి అభిమానులతో పాటుప్రేక్షకుల మన్ననలు పొందాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



