అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ మృతి
on Oct 6, 2025

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)ప్రీవియస్ మూవీ 'పుష్ప 2'(Pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్(Hyderabad)సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో 'రేవతి' అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ మరణానికి అల్లు అర్జున్ ని భాద్యుడ్ని చేస్తు పోలీసులు అరెస్ట్ చెయ్యగా, అల్లుఅర్జున్ ఒక రోజు జైలులో కూడా ఉన్నాడు. ఆ మరుసటి రోజు బెయిల్ పై బయటికొచ్చిన అల్లుఅర్జున్ మీడియా ముఖంగా తొక్కిసలాట గురించి తన వాదనని వినిపించాడు.
ఈ విషయంలో అల్లుఅర్జున్ మాటలకి కౌంటర్ ఇస్తు 'ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి'(Acp Vishnu Murthy)మాట్లాడటం జరిగింది. విష్ణుమూర్తి మాట్లాడిన మాటలు కూడా అప్పట్లో సంచలనం సృష్టించాయి. రీసెంట్ గా . విష్ణుమూర్తి గుండెపోటుతో మరణించారు. ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఉండగానే గుండెనొప్పితోఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో సహచరులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నిరంతరం ప్రజల సేవ, భధ్రత కోసం ఆయన కృషి చేశారని, పోలీసు శాఖకి విష్ణుమూర్తి చేసిన సేవలను స్మరించుకుంటు నివాళులర్పిస్తున్నారు.
విష్ణుమూర్తి అల్లు అర్జున్ గురించి మాట్లాడుతు ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్‌మీట్ పెట్టడమే తప్పనుకుంటే, పోలీసులపై ఆరోపణలు చేయడం మరో తప్పు. తాను చేసింది రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉందో లేదో తెలుసుకోవాలి. ఆయనేమీ పాలు తాగే పిల్లాడు కాదు. ఎవరైనా సరే పరిధి దాటి ప్రవర్తించకూడదు. ప్రైవేట్ సైన్యాన్ని చూసుకుని ఓవరాక్షన్ చేస్తే అందరినీ లోపలేస్తాం. చట్టం ముందు అందరూ సమానమే. హీరోలకి ప్రత్యేక చట్టాలేమీ ఉండవు. స్మగ్లింగ్ సినిమా తీసి దేశభక్తి సినిమా అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు'అంటూ అల్లు అర్జున్‌పై ఓ రేంజులో విరుచుకుపడ్డారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



