పవన్ అత్తతో సూర్య రొమాన్స్!
on Jul 16, 2016
అత్తరింటికి దారేది సినిమాలో పవన్ అత్త పాత్రలో నటించి అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది నదియా. ఆ సినిమా తరువాత తెలుగులో వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. అయితే నదియా ఇప్పుడు డైరెక్టర్ ఎస్.జె సూర్యతో రొమాన్స్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో నదియా నటించనుంది. ఈ సినిమాలో సూర్య, మహేష్ బాబుకి విలన్ పాత్రలో కనిపిచనున్నాడు. నదియా, సూర్య భార్యగా నటిస్తోంది. అయితే సూర్య, నదియాల మధ్య ఓ లవ్ ట్రాక్ కూడా ఉంటుందట. అంతేకాదు రెండు, మూడు రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. సినిమాలో సూర్య, నదియాల పాత్రలు హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.