
బాలీవుడ్ ముద్దగుమ్మ కత్రినా కైఫ్ ఇవాళ తన 33వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. అదేంటంటే తన పేరు మీద ఫేస్‌బుక్ పేజీని ఓపెన్ చేయడం. దేశంలోని అన్ని "వుడ్"ల స్టార్లు తమ అభిమానులతో టచ్‌లో ఉండటానికి సోషల్ మీడియా మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఎకౌంట్‌లు తెరిచారు. వాటిలో వారు చేస్తున్న సినిమా సంగతులతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. అయితే కత్రినా మాత్రం ఈ మ్యాటర్‌లో వెనుకబడే ఉంది. సోషల్ మీడియాలోకి ఎంటరవ్వాలంటూ ఫ్యాన్స్‌తో పాటు స్నేహితులు ఎన్నోసార్లు మొత్తుకున్నారు. కానీ కత్రినా మాత్రం ససేమిరా అంది. అయితే అభిమానుల అవేదనను అర్థం చేసుకుందో ఏమోగానీ..ఈ పుట్టినరోజున ఫేస్‌బుక్ పేజీని ఓపెన్ చేసింది. దీంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు.





