'NTR 30' షూటింగ్ ఎప్పుడు?
on Aug 18, 2022

'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ ఇప్పటికే 'ఆచార్య'తో ప్రేక్షకులను పలకరించాడు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'RC 15' కూడా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేశాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసకి విడుదలయ్యే అవకాశముందని అంటున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు తన కొత్త సినిమాని ప్రారంభించలేదు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నట్లు ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే దానిపై క్లారిటీ రావట్లేదు. దీంతో తారక్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు.
నిజానికి 'ఎన్టీఆర్ 30' ఈ ఏడాది జూన్ లేదా జులైలో ప్రారంభమై.. వచ్చే ఏడాది వేసవిలో విడుదలవుతుందని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ 'ఆచార్య' బిజినెస్ లో భాగమై డైరెక్టర్ కొరటాల లేనిపోని నష్టాలు, కష్టాలు తెచ్చుకున్నాడని.. అదే 'ఎన్టీఆర్ 30' ఆలస్యానికి కారణమని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ గురించి అప్డేట్ ఇవ్వకపోవడంపై తారక్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'ఎన్టీఆర్ 30' అప్డేట్ కావాలంటూ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 'NTR 30' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.
మరోవైపు మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న 'SSMB 28'ని కూడా త్వరలో స్టార్ట్ చేసి 2023 సమ్మర్ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇక ప్రభాస్ 2023 జనవరిలో 'ఆదిపురుష్', సెప్టెంబర్ లో 'సలార్' సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇలా అందరి హీరో సినిమాల అప్డేట్స్ వస్తూ, ఆ హీరోల ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుంటే.. తాము మాత్రం 'NTR 30' అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నామంటూ తారక్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇదిలా ఉంటే 'NTR 30' షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటూ కొత్త న్యూస్ వినిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



