'పోకిరి' రిలీజ్ డేట్ కి 'SSMB 28'.. ఇండస్ట్రీ హిట్ పై మహేష్ కన్ను!
on Aug 18, 2022

2006, ఏప్రిల్ 28న విడుదలైన 'పోకిరి' సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న రికార్డులను తిరగరాసి సౌత్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి మహేష్ బాబు స్టార్ ఇమేజ్ ని ఎన్నో రేట్లు పెంచేసింది. అంతటి ప్రభంజనం సృష్టించిన 'పోకిరి' రిలీజ్ డేట్ కి మరో సినిమాకి విడుదల చేయబోతున్నాడు మహేష్.
మహేష్ తన 28వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'అతడు', 'ఖలేజా' తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'SSMB 28'(వర్కింగ్ టైటిల్) పై భారీ అంచనాలు ఉన్నాయి. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్న సినిమాకి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఆగస్టు నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాదు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28, 2023న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మహేష్ 28వ సినిమా ఏప్రిల్ 28న విడుదలవుతుండటం, పైగా అది 'పోకిరి' రిలీజ్ డేట్ కావడంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మహేష్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ ఖాయమంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా టాలీవుడ్ లో ఏప్రిల్ 28కి ప్రత్యేక స్థానముంది. 1977 ఏప్రిల్ 28న విడుదలైన 'అడవి రాముడు', 2017 ఏప్రిల్ 28న విడుదలైన 'బాహుబలి-2' ఇండస్ట్రీగా హిట్స్ గా నిలిచి సంచలనం సృష్టించాయి. మరి 'అడవి రాముడు', 'పోకిరి', 'బాహుబలి-2' సినిమాల బాటలో 'SSMB 28' కూడా పయనించి రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



