పూరీ సినిమాలో జేమ్స్ బాండ్ గా యన్.టి.ఆర్.
on Feb 4, 2012
పూరీ సినిమాలో జేమ్స్ బాండ్ గా యన్.టి.ఆర్. నటించనున్నాడని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్.టి.ఆర్. హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పురీ జగన్నాథ్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మించే చిత్రం ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో యన్.టి.ఆర్. జేమ్స్ బాండ్ తరహాలో ఉండే పాత్రలో నటించనున్నారట. ఈ చిత్రం మొత్తం దాదాపు అమెరికాలోనే చిత్రీకరించనున్నారట.
గతంలో "ఆంధ్రావాలా" వంటి ఫ్లాప్ చిత్రాన్ని అందించిన దానికి ప్రతిగా ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసి, ఆ ఫ్లాప్ వెలితిని పూడుస్తానని దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటున్నాడని సమాచారం. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఏమైనా చేయగలడు. "ఆంధ్రావాలా" లాంటి ఫ్లాపులివ్వగలడు..."బిజినెస్ మ్యాన్" వంటి బ్లాక్ బస్టర్ నీ ఇవ్వగలడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



