నేను వార్ కి సిద్ధం.. అభిమానుల కోసమే వెళ్తున్నా
on Apr 4, 2024

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr) ఈ పేరే ఒక ప్రభంజనం. ఆయన చూడని రికార్డ్ లేదు. నేటికీ ఎన్నో రికార్డులు ఆయన పేరు మీదే భద్రంగా ఉన్నాయి. తను చేసే డాన్స్, చెప్పే డైలాగ్స్ కి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అసలు ఆయనకున్న ఫ్యాన్ బేస్ ని చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే. తన సినిమా రిలీజ్ రోజు ఆ విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సందర్భాలు కూడా తన సినీ జీవితంలో చాలానే ఉన్నాయి. సినిమా కోసం ఎంత కష్టమైనా పడతాడు. తాజాగా ఇప్పుడు ఆ విషయం మరోసారి నిజమైంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర (devara) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఇది తనకి ప్రెస్టేజియస్ట్ మూవీ కూడాను. అందుకే రిస్కీ షాట్స్ లో సైతం కాంప్రమైజ్ కావడంలేదు.ఇటీవలే ప్రారంభమయిన షెడ్యూల్లో నిర్విరామంగా పాల్గొంటున్నాడు. ఈ సారి మాత్రం అనుకున్న డేట్ కే రిలీజ్ చెయ్యాలనే పట్టుదలతో కూడా ఉన్నాడు. దీంతో పాటు వార్ 2 (war 2) లో షూటింగ్ కి కూడా డేట్స్ కేటాయించాడు. ఈ నెల మూడవ వారంలోనే సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు. ముంబై లో వేసిన ఒక భారీ సెట్ లో ఎన్టీఆర్ పై పది రోజులపాటు మేకర్స్ షూట్ ని జరపనున్నారు. కథ కి సంబంధించిన కీలక సన్నివేశాలని తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ వచ్చినట్టయ్యింది.
ఎందుకంటే వార్ 2 లో ఎన్టీఆర్ ఫిక్స్ అయినప్పటినుంచి ఇంతవరకు షూట్ లో పాల్గొనలేదు.దీంతో ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటాడా అని ఎదురుచూసారు. ఇప్పుడు వాళ్ళ కోరిక నెరవేరినట్టయింది. ఒక పవర్ ఫుల్ పాత్రని ఎన్టీఆర్ పోషిస్తున్నాడు. పైగా ఎన్టీఆర్ నటిస్తున్న డైరెక్ట్ హిందీ మూవీ కూడా కావడంతో అందరిలో ఎంతో ఆసక్తి ఉంది. హృతిక్ (hrithik roshan) తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజంటేషన్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ కూడా ఉంది. వార్ 2 కి ఆయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకుడు. ఆర్ఆర్ఆర్(rrr) తర్వాత బాలీవుడ్ లో చాలా సినిమాల ఆఫర్స్ వచ్చినా కూడా ఎన్టీఆర్ వార్ 2 కి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



