యన్.టి.ఆర్."యాక్షన్" ఫిబ్రవరి 2 న ప్రారంభం
on Jan 18, 2012
యన్.టి.ఆర్."యాక్షన్" ఫిబ్రవరి 2 న ప్రారంభంకానుందని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్.టి.ఆర్. హీరోగా, "దూకుడు" హిట్ తో దూకుడు మీదున్న శ్రీను వైట్ల దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రానికి "యాక్షన్" అన్న పేరు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ "యాక్షన్" కి "విత్ ఎంటర్ టైన్ మెంట్" అన్న క్యాప్షన్ ని నిర్ణయించారు.
అలాంటి ఈ "యాక్షన్" చిత్రం ఫిబ్రవరి 2 వ తేదీన అంటే రవితేజ "నిప్పు" చిత్రం విడుదల రోజున ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత గణేష్. ఈ "యాక్షన్" చిత్రంలో యన్ టి ఆర్ సరసన హీరోయిన్లు ఎంతమంది నటిస్తున్నారు...? వారి పేర్లేమిటి...? సంగీత దర్శకుడు మిగిలిన సాంకేతిక నిపుణులు, నటీనటవర్గం పేర్లు, వివరాలూ ఇంకా తెలియరాలేదు.