ఒకేసారి రెండు సర్ ప్రైజ్ లు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మామూలు కిక్ కాదు!
on Aug 5, 2024

ప్రస్తుతం 'దేవర', 'వార్-2' సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ ప్రకటన రాగానే అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. అసలే ఎన్టీఆర్ బిగ్గెస్ట్ మాస్ హీరో. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఇక ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్', 'సలార్' వంటి భారీ యాక్షన్ సినిమాలతో నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఈ ఇద్దరి కాంబోలో మూవీ అనగానే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులు త్వరలోనే ఫలించబోతున్నాయి. ఈ మూవీ ఆగష్టు 9న లాంచ్ కానుందని సమాచారం. దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, కొరటాల శివ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారట. అంతేకాదు.. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని, మొదటి షెడ్యూల్ ఎన్టీఆర్ లేకుండానే స్టార్ట్ అవుతుందని టాక్.
దేవర నుంచి తాజాగా సెకండ్ సాంగ్ విడుదలైంది. ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుండంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్ న్యూస్.. వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది అనడంలో సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



