Birthmark OTT : ఓటీటీలోకి క్రేజీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
on Aug 5, 2024
కొన్ని ఇతర భాషలలో రిలీజ్ అయిన సినిమాలు తెలుగులోకి డబ్ చేస్తే బాగుంటుందని తెలుగు సినిమా అభిమానులు వెతుకుతుంటారు. అలాంటివి ఓటీటీలో రిలీజ్ అయితే సమయం కేటాయించుకొని మరీ వీక్షిస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారికోసం ఓ సినిమా తెలుగు వర్షన్ రానుంది.
డిఫరెంట్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ సినిమా సజెస్ట్ చేసేయోచ్చు. ఇంతకి ఆ సినిమా ఏంటంటే 'బర్త్ మార్క్' (Birthmark). జైలర్ సినిమాలో రజనీకాంత్ కి కోడలిగా మిర్నా మీనన్ నటించింది. ఈమె ప్రధాన పాత్ర పోషించిన సినిమానే 'బర్త్ మార్క్'. ఈ ఏడాది తమిళంలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తోంది. ఈ నెల 8 నుండి స్ట్రీమింగ్ అవుతుందని ఆహా అధికారిక ప్రకటన చేసింది. భిన్నమైన కథని ఇష్టపడే వారికి ఈ సినిమా ఓ అప్షన్ అనే చెప్పాలి. ఈ సినిమా తమిళంలో హిట్ టాక్ తెచ్చుకుంది.
'బర్త్ మార్క్' కథ విషయానికొస్తే.. భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు భర్త తనని టెక్నాలజీకీ దూరంగా ఉన్న ప్రాంతంలో ఉంచాలని అనుకుంటాడు. అందుకోసం తనని కొండల్లోని మారుమూల ప్రాంతంలో ఉంచుతాడు. అయితే అక్కడికి వెళ్ళాక భర్త కాస్త వింతగా ప్రవర్తిస్తుంటాడు. మరి భర్త ఎందుకలా చేశాడు? భార్యని అసలెందుకు అక్కడికి తీసుకెళ్ళాడనేది ఈ సినిమా కథ. మరి పూర్తి కథేంటో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
