టైగర్ కి టైమొచ్చింది.. గ్లోబల్ స్టార్ గా ఎన్టీఆర్!
on Jul 19, 2022

'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఇక ఓటీటీలో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ సినిమాకి ఫిదా అవుతున్నారు. అయితే ఈ సినిమాకి మొదట్లో తారక్ కి రావాల్సినంత గుర్తింపు రాలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ లేట్ గా అయినా లేటెస్ట్ గా గర్జిస్తున్నాడు యంగ్ టైగర్. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతోంది.

'ఆర్ఆర్ఆర్'లో ఇంటర్వెల్ కి ముందు ఓ ట్రక్ లో యానిమల్స్ ని తీసుకొచ్చి భీమ్ పాత్రధారి తారక్ బ్రిటిష్ కోటాపై ఎటాక్ చేసే సీన్ సినిమాకే మేజర్ హైలైట్ గా నిలిచింది. తాజాగా ఒక ఫారెన్ ఆడియెన్ మార్వెల్ మూవీస్ లో కూడా ఇలాంటి సన్నివేశం చూడలేదంటూ.. ఆ సీన్ లోని ఒక క్లిప్ ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఆ ట్వీట్ నిమిషాల్లోనే వైరల్ గా మారింది. ఒక్క రోజులోనే ఆ వీడియో క్లిప్ కి 10 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇండియన్ మూవీ క్లిప్ కి ట్విట్టర్ లో 10 మిలియన్ కి పైగా వ్యూస్ రావడం ఇదే మొదటిసారి. దీంతో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా ఒక్కసారిగా ట్విట్టర్ లో తారక్ పేరు మారుమోగుతోంది.

అలాగే అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విన్నర్ మాథ్యూ ఎ.చెర్రీ కూడా భీమ్ క్లిప్ పై స్పందించాడు. క్లిప్ లో భీమ్ ట్రక్ లోనుంచి దూకే షాట్ మొత్తం లేకపోవడంతో.. సూపర్ హీరో(భీమ్) లాండింగ్ లేకపోవడం తనను డిజప్పాయింట్ చేసిందని ట్వీట్ చేశాడు. అంతేకాదు ఆయన ట్విట్టర్ లో ఎన్టీఆర్ ని ఫాలో అవుతుండటం ఆసక్తికరంగా మారింది.

ఇక 'నెట్ ఫ్లిక్స్ నైజీరియా' అధికారిక పేజ్ అయితే హాలీవుడ్ యాక్టర్స్ తో పాటు భీమ్(తారక్) ఫోటోని పెట్టి.. వీటిలో మీకు మనసుకి బాగా నచ్చిన పాత్ర ఏంటని ఆడియన్స్ ని అడిగింది. కామెంట్స్ ఎక్కువగా భీమ్ అని వస్తుండటంతో.. 'మీ అందరికీ భీమ్ పాత్రే నచ్చిందని అర్థమవుతుంది' అంటూ మరో ట్వీట్ చేసింది. ఇలా ప్రస్తుతం ట్విట్టర్ లో భీమ్ మేనియా నడుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం ట్విట్టర్ లో #NTRGoesGlobal నేషనల్ వైడ్ గా టాప్ ట్రెండింగ్ లో ఉంది. మొత్తానికి భీమ్ పాత్రతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు తారక్. ఆర్ఆర్ఆర్ కి ముందు వరకు తారక్ ఎంత గొప్ప నటుడో తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తారక్ ప్రతిభ ఏంటో తెలియడానికి 'కొమురం భీముడో' సాంగ్ ఒక్కటి చాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



