'NTR30' అప్డేట్ వచ్చేసింది.. తారక్ ఫ్యాన్స్ కి పూనకాలే!
on May 19, 2022
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందడి షురూ అయింది. 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు తారక్. దీంతో ఆయన తదుపరి సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానే ఎదురుచూస్తున్నారు. రేపు(మే 20) తారక్ బర్త్ డే కావడంతో అప్డేట్స్ షురూ అయ్యాయి.
తారక్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్ ని ఈరోజు రాత్రి 7:02 కి ఇస్తున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. తారక్ తో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయనున్నట్లు ఇప్పటికే కొరటాల తెలిపాడు. అందుకు తగ్గట్లే తాజాగా విడుదలైన పోస్టర్.. రెయిన్ ఎఫెక్ట్ లో నెత్తుటి మరకలతో ఉన్న కత్తిని పట్టుకొని పవర్ ఫుల్ గా ఉంది. 'జనతా గ్యారేజ్'తో గతంలో తారక్ కి బ్లాక్ బస్టర్ అందించిన కొరటాల.. ఈ పక్కా కమర్షియల్ సినిమాతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉన్నాడు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ చేయనున్న 'NTR 31' అప్డేట్ కూడా వచ్చే అవకాశముంది.
Also Read