`తలైవర్ 169`కి రజినీకాంత్ షాకింగ్ రెమ్యూనరేషన్!?
on May 19, 2022
జయాపజయాలకు అతీతమైన ఇమేజ్.. సూపర్ స్టార్ రజినీకాంత్ సొంతం. 70 ఏళ్ళు దాటినా.. అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు రజినీ. రీసెంట్ గా `అణ్ణాత్తే` (తెలుగులో `పెద్దన్న`)తో పలకరించిన సూపర్ స్టార్.. సదరు చిత్రం కోసం దాదాపు రూ. 100 కోట్ల పారితోషికం అందుకున్నారని కోలీవుడ్ వర్గాలు కోడై కూశాయి.
ఇదిలా ఉంటే, `డాక్టర్`, `బీస్ట్` చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో `తలైవర్ 169` అనే వర్కింగ్ టైటిల్ తో రజినీకాంత్ ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతమందించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఆగస్టు నుంచి పట్టాలెక్కనుందని సమాచారం. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ సినిమా కోసం రజినీకాంత్ అక్షరాలా రూ. 150 కోట్ల భారీ పారితోషికం తీసుకోనున్నారట. అదే గనుక నిజమైతే.. కోలీవుడ్ స్టార్స్ లో ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరో రజినీకాంత్ అనే చెప్పాలి. మరి.. రజినీకాంత్ షాకింగ్ రెమ్యూనరేషన్ పై జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. కాగా, సన్ పిక్చర్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న `తలైవర్ 169`.. 2023 ప్రథమార్ధంలో రిలీజ్ కానుంది.