సంక్రాంతి సినిమాల్లో ఎక్కువ లాభాలు చూసిన నిర్మాత ఎవరో తెలుసా?
on Jan 21, 2026
.webp)
సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు
లాభపడిన నిర్మాత ఎవరు?
ఎక్కువ లాభాలు తెచ్చిన సినిమా ఏది?
2026 సంక్రాంతికి 'ది రాజా సాబ్', 'మన శంకర వరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నారీ నారీ నడుమ మురారి' ఇలా మొత్తం ఐదు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. మరి వీటిలో తక్కువ బడ్జెతో నిర్మాతకు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏదో తెలుసా?
ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలైన 'ది రాజా సాబ్', 'మన శంకర వరప్రసాద్ గారు' తర్వాత.. ప్రేక్షకుల దృష్టిని ఎక్కువ ఆకర్షించిన సినిమా 'అనగనగా ఒక రాజు' అనడంలో సందేహం లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన మూవీ ఇది.
'అనగనగా ఒక రాజు' చిత్ర విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో నిర్మాతకు బాగా డబ్బులు వచ్చాయి. ఇక విడుదల తర్వాత కూడా.. మొదటి వారంలోనే రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఇప్పటిదాకా 'అనగనగా ఒక రాజు' ద్వారా మేకర్స్ కి రూ.30 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది.
యంగ్ హీరోతో రూపొందించిన సినిమా రూ.30 కోట్ల లాభాలు తెచ్చిపెట్టడం అనేది మామూలు విషయం కాదు. అందుకే ఈ విషయంలో నిర్మాత నాగవంశీ ఫుల్ హ్యాపీగా ఉన్నారట.
.webp)
Also Read: 'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ
'అనగనగా ఒక రాజు' సినిమా విషయంలో మొదటి నుంచి పక్కా ప్లానింగ్ తో వెళ్ళారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి తగినంత సమయం కేటాయించారు. కొన్ని కారణాల వల్ల సినిమా కాస్త ఆలస్యమైనా.. రీజనబుల్ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ని అందించగలిగారు. కంటెంట్ ని ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళడంలోనూ సక్సెస్ అయ్యారు. దాంతో విడుదలకు ముందు మంచి బిజినెస్ జరిగింది. విడుదల తర్వాత కూడా భారీ వసూళ్లు వచ్చాయి. మొత్తానికైతే నిర్మాతలు అదిరిపోయే లాభాలు చూశారు.
'అనగనగా ఒక రాజు' స్ఫూర్తితో యంగ్ హీరోలతో మరిన్ని మంచి సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో నాగవంశీ ఉన్నారట. ఇదే బాటలో ఇతర నిర్మాతలు కూడా పయనించే అవకాశముంది.
Also Read: అల్లు అర్జున్ కి రూట్ క్లియర్!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



