దుబాయ్ వెళ్ళడానికి కారణం ఇదే.. ప్రముఖ హీరోయిన్ వెల్లడి
on Jan 21, 2026

-రిమీ సేన్ వ్యాఖ్యల్లోని మర్మమేంటి!
-పాలసీలని మారుస్తుంది ఎవరు
-దుబాయ్ లో ఏం చేస్తుంది
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi),శ్రీను వైట్ల(Srinu vaitla)కాంబోలో వచ్చిన అందరి వాడు ద్వారా తెలుగు సినీప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపుని పొందిన భామ 'రిమీ సేన్(Rimi Sen). హిందీలో చేసిన ధూమ్ ద్వారా అయితే ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ని పొందింది. హంగామా, గోల్ మాల్ వంటి చిత్రాల్లో కూడా మెరిసిన రిమీ సేన్ సినిమాలకి స్వస్తి చెప్పి రియల్ ఎస్టేట్ రంగంలో కొన్నేళ్ల క్రితం దుబాయ్ లో సెటిల్ అయ్యింది. ఆ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్ చేస్తున్నాయి.
దుబాయ్(Dubai)లో సెటిల్ అవ్వడంపై ఆమె మాట్లాడుతు మన దేశంలో ప్రభుత్వం రాత్రికి రాత్రి పాలసీలని మారుస్తున్నాయి. దీంతో వ్యాపారం చెయ్యడం చాలా కష్టతరంగా మారింది. నా దృష్టిలో ఇప్పుడు ఇండియా వ్యాపారం చెయ్యడానికి అంత అనుకూలమైన దేశం కాదు. అందుకే బిజినెస్ పరంగా సులభకరంగా ఉన్న దుబాయ్ కి మారిపోయానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.రిమీ సేన్ స్వస్థలం కోల్ కతా.
Also read: బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబో.. వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందా!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



