ENGLISH | TELUGU  

ఆకట్టుకుంటున్న 'మంత్ ఆఫ్ మ‌ధు' టీజర్

on Sep 29, 2022

విభిన్న పాత్రలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌వీన్ చంద్ర‌ మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మంత్ ఆఫ్ మ‌ధు'. ఇందులో నవీన్ కి జోడీగా క‌ల‌ర్స్ స్వాతి నటిస్తుండటం విశేషం.

శ్రీకాంత్ నాగోటి దర్శ‌క‌త్వంలో క్రిష్వి ప్రొడ‌క్ష‌న్స్‌, హ్యండ్ పిక్డ్ స్టోరీస్ బ్యాన‌ర్స్‌పై య‌శ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో న‌వీన్ చంద్ర, శ్రీకాంత్ నాగోటి కాంబినేష‌న్‌లో వచ్చిన 'భానుమతి అండ్ రామకృష్ణ' ఓటీటీలో విడుదలై ఆకట్టుకుంది. ఈ హిట్ కాంబో 'మంత్ ఆఫ్ మధు' చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమైంది.

రీసెంట్‌గా రిలీజైన 'మంత్ ఆఫ్ మ‌ధు' ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్‌ నిడివి 1 నిమిషం 58 సెక‌న్లు ఉంది. అందులో బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌తో సినిమా క‌థేంటో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు దర్శకుడు. సహజ సన్నివేశాలు, సంభాషణలతో టీజర్ ఆకట్టుకుంటోంది.

మాన‌వ సంబంధాలు.. ఓ విష‌యాన్ని జనం ఏ కోణంలో చూస్తున్నార‌నే దానిపైనే 'మంత్ ఆఫ్ మ‌ధు'  చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్లు టీజ‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. క‌ల‌ర్స్ స్వాతి ఇందులో గృహిణి పాత్ర‌లో న‌టించింది. విప‌రీత‌మైన భావోద్వేగాలున్న తాగుబోతు భ‌ర్త పాత్ర‌లో న‌వీన్ చంద్ర యాక్ట్ చేశారు. వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో లైవ్ లోకేష‌న్స్‌లో సింక్ సౌండ్‌తో 'మంత్ ఆఫ్ మ‌ధు' సినిమాను రూపొందించారు.

శ్రేయా న‌వేలీ, హ‌ర్ష చెముడు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. య‌శ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ చిత్రానికి అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందించారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.