శ్రీదేవి మామ్ షార్ట్ రివ్యూ..
on Jul 5, 2017
చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా దశాబ్దాలు ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లిష్ తో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చింది. విడుదలయిన దాదాపు అన్ని భాషల్లో ఇంగ్లీష్ వింగ్లిష్ హిట్ గా నిలిచి, స్త్రీ ప్రధాన చిత్రాల్లో అతి పెద్ద సక్సెస్ ఫుల్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ ఊపులోనే రాజమౌళి బాహుబలిలో శివగామి పాత్రకి శ్రీదేవిని సంప్రదించాడు. అయితే, భారీ డిమాండ్ లతో రాజమౌళికి బాహుబలి నిర్మాతలకి దాదాపు చెమటలు కక్కించింది శ్రీదేవి. కుయ్యో మొర్రో అంటూ మళ్ళీ మన రమ్య కృష్ణని ఓకే చేసారు. తర్వాత శ్రీదేవి తమిళంలో పులి అనే సినిమా చేసింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కొంత గ్యాప్ తీసుకుంది. ఈ శుక్రవారం విడుదలవనున్న మామ్ తో శ్రీదేవి మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వస్తుంది. బాలీవుడ్ పెద్దల కోసం ముంబైలో ఈ సినిమా ప్రీమియర్ షో వేసారట. ప్రముఖ బాలీవుడ్ రివ్యూ రైటర్, ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ మాట్లాడుతూ మామ్ అద్భుతంగా ఉంది అని... కొత్త కథ, సరికొత్త కథనం, దర్శకుడి పని తీరు, శ్రీదేవి, ఇతర నటీ నటుల మైమరపించే నటన, కంట తడిపెట్టించే భారమయిన సన్నివేశాలు వెరసి మామ్ తప్పకుండా చూడాల్సిన సినిమా అని కితాబిచ్చారు.