మోహన్ బాబు 'పద్మశ్రీ' వివాదం ముగిసింది
on Aug 3, 2015
.jpg)
ప్రముఖ సినీ నటుడు బాబుకు పద్మశ్రీ తిరిగొచ్చింది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఆయన ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కరాన్ని కొనసాగించాలని తీర్పిచ్చింది. దీంతో మోహన్ బాబు మళ్లీ పద్మశ్రీ మోహన్ బాబు అవుతున్నారు. పద్మశ్రీ పురస్కారాన్ని మోహన్‌బాబు దుర్వినియోగం చేస్తున్నారంటూ గతంలో మోహన్‌బాబుపై కేసులు నమోదు కావడం, హైకోర్టు ఈ విషయమై సీరియస్‌గా స్పందించి, పద్మశ్రీని మోహన్‌బాబు ఉపయోగించుకోరాదని తేల్చి చెప్పిన విషయం విదితమే.ఈ నేపథ్యంలోనే మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇకపై ఎక్కడా పద్మశ్రీ పురస్కారాన్ని దుర్వినియోగం చేయబోమనని ప్రమాణం చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు మోహన్‌బాబు. మోహన్‌బాబు అఫిడవిట్‌పై సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు ఇకనుంచి పద్మశ్రీ పురస్కారం మోహన్‌బాబుకి యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



