జై మహిష్మతి...బాహుబలి 'పీకే'ను దాటేసింది
on Aug 3, 2015
.jpg)
అవును...మీరు వింటుంది నిజమే బాహుబలి సినిమా 'పీకే'ను దాటేసింది. మహిష్మతి రాజ్యం ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ గా నిలిచింది. అయితే ఓవరాల్ కలెక్షన్లలో మాత్రం 'పీకే'దె మొదటి స్థానం. 500 కోట్ల క్లబ్ లో ఇంకా చేరని బాహుబలి ఇండియా షేర్ కలెక్షన్లలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 24 రోజులలో బాహుబలి ఇండియా వరకు రూ.345 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఈ దెబ్బతో అమీర్ ఖాన్ 'పీకే' 337 కోట్లతో రెండో స్థానానికి పడిపోయింది.
ఒకవారం లేట్ గా రిలీజై బాహుబలి దాటిపోతున్న ‘భజరంగి భాయిజాన్’, ఇండియాలో మాత్రం బాహుబలిని దాటడం కష్టమేనని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే 500కోట్ల క్లబ్ లో చేరిన ‘భజరంగి భాయిజాన్’ ఇండియా నెట్ వసూళ్లు మాత్రం 250 కోట్ల లోనే వున్నాయి. దీంతో ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్ లో కూడా చేరుతుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే 'బాహుబలి' లాంటి ఓ రీజనల్ సినిమా ఇండియాలో నెంబర్ వన్ స్థాన౦లో నిలవడం మాములు విషయం కాదు. హాట్స్ ఆఫ్ టు రాజమౌళి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



