'గాడ్ ఫాదర్' టీజర్ అదిరింది.. మెగా జాతర షురూ!
on Aug 21, 2022
మెగా జాతర మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనువిందు చేయనున్నాడు. చిరంజీవి పుట్టినరోజు(ఆగస్ట్ 22) కానుకగా ఒకరోజు ముందుగానే తాజాగా 'గాడ్ ఫాదర్' టీజర్ ను విడుదల చేశారు.
"ఇరవై ఏళ్ళు ఎక్కడికెళ్లాడో ఎవరికీ తెలీదు. సడెన్ గా తిరిగొచ్చి ఈ ఆరేళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు" అంటూ చిరంజీవి పాత్రని పరిచయం చేస్తూ మురళి శర్మ చెప్పే వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమైంది. 'బాస్ అఫ్ ది మాసెస్.. వన్ అండ్ ఓన్లీ గాడ్ ఫాదర్' అనే వాయిస్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో.. గన్ తో షూట్ చేస్తూ వచ్చిన చిరు ఎంట్రీ ఫ్యాన్స్ కన్నుల పండుగలా ఉంది. ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండానే.. కేవలం తన స్క్రీన్ ప్రజెన్స్ తో మెగాస్టార్ క్లాప్స్ కొట్టేలా చేశాడు. ఇక చివరిలో సల్మాన్ ఖాన్ స్టైలిష్ ఎంట్రీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్లు టీజర్ లో తెలిపారు. టీజర్ ని తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేశారు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'గాడ్ ఫాదర్'లో నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
