సాయి థరమ్ తేజ్ `భోగి` కాదట!!
on Jun 11, 2019

సాయిధరమ్ తేజ్ , మారుతి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్నట్లు గత కొంత కాలంగా న్యూస్ వస్తోన్న మాట తెలిసిందే. అయితే ఈ చిత్రం పై ఇప్పటికీ అఫీషియల్ ప్రకటన రాకపోయినా, ప్రాజెక్ట్ కి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఇప్పటికే సాయిధరమ్ తేజ్ సరసన హరోయిన్ గా అవికా గోర్ తో పాటు, మాళవిక శర్మను ఓకే చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇంత వరకు దీని పై క్లారిటీ మాత్రం రాలేదు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్ని వాసు నిర్మించనున్నాడట. చిత్రలహరి విజయం తర్వాత తేజు పెద్ద సంస్థలతో కలిసి సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకు `భోగి` అనే టైటిల్ ఫిక్స్ చేయాలని మొదట భావించారట. కానీ, ఆ టైటిల్ కు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో దాని ప్లేస్ లో ఆ మీనింగ్ వచ్చేలా ప్రతి రోజూ పండగే అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సి నిమాకు సంబంధించిన న్యూస్ అతి త్వరలో అధికారికంగా వచ్చే అవకాశాలున్నయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



