నాకు ఒక చరిత్ర ఉంది.. కెరీర్ లోనే ఫస్ట్ టైం రికార్డు వ్యూస్
on Aug 11, 2025

మాస్ మహారాజ 'రవితేజ'(Ravi Teja)అప్ కమింగ్ మూవీ 'మాస్ జాతర'(Mass Jathara). యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా, ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజ చేసిన చిత్రాలు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ అంతగా అలరించక పోవడంతో 'మాస్ జాతర'తో అయినా, తమ అభిమాన హీరో భారీ హిట్ ని అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు. రవితేజ సరసన శ్రీలీల(Sreeleela)జత కడుతుండగా నూతన దర్శకుడు భాను బోగవరపు(Bhanu Bogavarapu) తెరకెక్కించాడు.
రీసెంట్ గా మాస్ జాతర నుంచి టీజర్ రిలీజయ్యింది. నిమిషం ముపై సెకన్ల నిడివితో ఉన్న టీజర్ చూస్తుంటే మూవీలో రవితేజ ఎనర్జీ ఒక లెవల్లో ఉండబోతుందని అర్ధమవుతుంది. ఒక క్యారక్టర్ రవితేజ గురించి చెప్తు 'తను చేసే ఫైర్ డిపార్ట్మెంట్ లో తప్ప అన్ని డిపార్ట్మెంట్స్ లో వేలు పెడతాడని చెప్పించడం, శ్రీలీలతో రవితేజ చెప్పిన డైలాగులు చూస్తుంటే ప్రేక్షుకులకి ఈ సారి ఫుల్ మీల్స్ గ్యారంటీ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నాకంటూ ఒక చరిత్ర ఉందని రవితేజ చెప్పిన డైలాగ్ అభిమానులని విశేషంగా ఆకరిస్తుంది. ఫైట్స్ సరికొత్తగా డిజైన్ చేసారని అర్ధమవుతుండటంతో పాటు, విజువల్ గా ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న కెమెరా పనితనం మెస్మరైజ్ చేయనుందని తెలుస్తుంది.
అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా మాస్ జాతర ని నిర్మించగా, రాజేంద్ర ప్రసాద్(Rajendraprasad)తో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో((Beems sisirolio)సంగీత దర్శకత్వంలో ఇప్పటికే విడుదలైన రెండు పాటలకి అద్భుతమైన స్పందన లభించింది. టీజర్ విడుదలైన నిమిషాల్లోనే రవితేజ గత చిత్రాల టీజర్స్ కంటే రికార్డు వ్యూస్ ని రాబడుతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



