'మన్మథుడు 2'కు ముహూర్తం ఖరారు!
on Nov 25, 2018
.jpg)
తెలుగు ప్రేక్షకులకు 'మన్మథుడు' అంటే కింగ్ అక్కినేని నాగార్జున గుర్తొస్తారు. త్రివిక్రమ్ కథతో రూపొందిన ఆ చిత్రం సూపర్‌హిట్. త్రివిక్రమ్ అభిమానులు కల్ట్ క్లాసిక్ అంటుంటారు. మహిళా అభిమానుల్లో నాగార్జున ఇమేజ్ మరింత పెంచిన చిత్రమది. ఇప్పుడు 'మన్మథుడు' సీక్వెల్‌కి ముహూర్తం ఖరారైంది. నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా నటించిన 'చిలసౌ'తో దర్శకుడిగా పరిచయమైన హీరో రాహుల్ రవీంద్రన్. ఈయన నాగార్జున కోసం ఓ కథను సిద్ధం చేశారు. స్టోరీలైన్ విన్న నాగార్జున 'మన్మథుడు 2' టైటిల్ రిజిస్టర్ చేయించారు. 'చిలసౌ' విడుదల తరవాత నుంచి ఈ కథ సిద్ధం చేయడంపై రాహుల్ రవీంద్రన్ దృష్టి పెట్టారు. స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి కావడంతో జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని నాగార్జున నిర్ణయించారట. సంక్రాంతికి పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించి, ఆ తరవాత సెట్స్ పైకి సినిమాను తీసుకు వెళ్తారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



