'మంజుమ్మల్ బాయ్స్' డైరెక్టర్ ఫస్ట్ తెలుగు మూవీ.. హీరో ఎవరు..?
on Jul 19, 2024

మలయాళ ఇండస్ట్రీ ఫిల్మ్ 'మంజుమ్మల్ బాయ్స్' (Manjummel Boys) తెలుగుతో పాటు వివిధ భాషల ప్రేక్షకులను మెప్పించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా చిదంబరం (Chidambaram) దర్శకత్వంలో రూపొందిన ఈ సర్వైవల్ థ్రిల్లర్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసింది. మలయాళ సినీ చరిత్రలో రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా 'మంజుమ్మల్ బాయ్స్' నిలిచింది. ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ.240 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ సినిమాతో ఒక్కసారిగా దర్శకుడు చిదంబరం పేరు మారుమోగిపోయింది. ఆయనతో సినిమా చేయడానికి వివిధ భాషలకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే చిదంబరం టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మలయాళ దర్శకుడు చిదంబరం తన తొలి తెలుగు సినిమాని సైన్ చేసినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ చిత్రాన్ని నిర్మించనుందట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. తన డెబ్యూ తెలుగు మూవీ కోసం చిదంబరం అదిరిపోయే కథను చేశాడట. మలయాళ ఇండస్ట్రీ ఫిల్మ్ 'మంజుమ్మల్ బాయ్స్' డైరెక్ట్ చేసిన చిదంబరం ఫస్ట్ తెలుగు మూవీ కావడంతో.. ఇందులో హీరోగా ఎవరు నటిస్తారనే ఆసక్తి నెలకొంది. మరి మైత్రి మూవీ మేకర్స్ హీరోగా ఎవరిని రంగంలోకి దింపుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



