పహల్ గామ్ దాడి దృష్ట్యా మంచు విష్ణు కీలక నిర్ణయం..అభినందిస్తున్న ప్రజానీకం
on May 2, 2025

ఏప్రిల్ 22 న 'పహల్ గామ్'(Pahal Gam)లోని బైసారన్ వాలీ(Balsaran valley)లో ప్రకృతి అందాలని చూడటానికి వెళ్లిన టూరిస్టులపై ఐదుగురు ఉగ్రవాదులు భారత మిలిటరీ డ్రస్ లో వచ్చి కాల్పులు జరపడంతో 28 మంది చనిపోవడం జరిగింది. వీళ్లల్లో ఆంధ్రప్రదేశ్(andhrapradesh)లోని నెల్లూరు(Nellore)జిల్లా కావలి(Kavali)నగరానికి చెందిన 'సోమిశెట్టి మధుసూదన్'(Somisetty madusudhan)ఉన్నాడు.
ఈ రోజు ఉదయం ప్రముఖ హీరో మంచు విష్ణు(Manchu Vishnu)కావలి వెళ్లి మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించాడు. మధుసూదన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన విష్ణు ఆ తర్వాత మాట్లాడుతు ఉగ్రవాద దాడి చాలా బాధాకరం. మధుసూదన్ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పాడు. మధుసూదన్ కుటుంబాన్ని విష్ణు పరామర్శించడంతో సోషల్ మీడియా వేదికగా పలువురు నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
విష్ణు ప్రస్తుతం పరమేశ్వరుడి(parameswarudu)కి అత్యంత ప్రీతిపాత్రకరమైన భక్తుడు 'కన్నప్ప'(Kannappa)జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'కన్నప్ప' మూవీ చేస్తున్నాడు. జూన్ 27 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



