పెళ్లయినా సరే..ఆయనే కావాలి
on Sep 12, 2016
.jpg)
సూర్య..క్లాస్ పర్ఫామెన్స్ అయినా, మాస్ పర్ఫామెన్స్ అయినా లేదా రెండు కలిపైనా సరే రఫ్ఫాడించగల నటుడు. ఆ నటనతోనే సౌత్‌లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సూర్య అభిమానుల్లో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఉన్నారు. సినిమాల్లో హీరోలను తమ వెంట తిప్పుకునే హీరోయిన్లు కూడా సూర్య అంటే పడి చచ్చిపోతారు. ఆ కోవలోకే వస్తుంది "ప్రేమమ్" భామ సాయిపల్లవి. ప్రేమమ్ సినిమాలో లేడీ లెక్చరర్‌గా నటించి ప్రేక్షకులను మాయ చేసిన పల్లవికి ఆ సినిమాతో పెద్ద అభిమాన గణం తయారైంది. ఇప్పటికే ఎంతోమంది ఆన్‌లైన్‌లో ఆమెకు లవ్ ప్రపోజల్స్ కూడా పెట్టేస్తున్నారు.
అయితే ఆమెకు మాత్రం సూర్య అంటే విపరీతమైన పిచ్చట. అతని నటనంటే పడి చస్తుందట, సూర్య సరసన నటిస్తానో లేదో తెలియదు కానీ ఆయన ఎదురుపడినా..ఎక్కడైనా కలిసినా వెంటనే "ఐ లవ్ యూ" చెప్పేస్తానని నిర్మోహమాటంగా చెప్పేస్తోంది. అయితే సూర్యకు అల్రెడీ పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారన్న విషయాన్ని పల్లవి గుర్తుంచుకుంటే మంచిది. అసలే ఇండస్ట్రీలో ఎవరు దొరుకుతారా అని ఎదురుచూసే వాళ్లకి గనక ఈ మాటలు తెలిస్తే ఇంకేమైనా ఉందా...?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



