నానితో రవితేజ హీరోయిన్!
on Sep 18, 2021
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన `నేల టిక్కెట్టు` (2018) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఉత్తరాది భామ మాళవికా శర్మ. తొలి సినిమా నిరాశపరిచినా.. `రెడ్` రూపంలో మాళవికకి మరో అవకాశం దక్కింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఫర్లేదనిపించుకుంది.
ఇదిలా ఉంటే.. మాళవికకి తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నాయికగా నటించే ఛాన్స్ దక్కిందట. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం `అంటే.. సుందరానికీ!` చిత్రంతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని.. త్వరలో సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. `దసరా` అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్ట్ తెలంగాణ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా రూపొందనుందని సమాచారం. కాగా, ఈ చిత్రంలో ఇద్దరు నాయికలకు స్థానముండగా.. సెకండ్ లీడ్ గా మాళవిక ఎంపికైందని బజ్. త్వరలోనే `దసరా` చిత్రంలో మాళవికా శర్మ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. ఈ సినిమాతోనైనా మాళవిక ఖాతాలో సాలిడ్ హిట్ చేరుతుందేమో చూడాలి.
కాగా, విజయదశమి సందర్భంగా `దసరా` చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
Also Read