'ఆగడు' కోసం అజ్మీర్ దర్గాకి మహేష్
on Sep 18, 2014
.jpg)
తన సినిమాల విడుదల ముందు అజ్మీర్ దర్గాను దర్శించుకోవడం హీరో మహేష్ బాబు కి ఈమధ్య సెంటిమెంటుగా మారింది. గతంలో 'దూకుడు' సినిమా హిట్టయ్యాక ఓసారి వెళ్ళాడు. తర్వాత 'బిజినెస్ మేన్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాల విడుదల సమయంలో కూడా ప్రత్యేకంగా వెళ్లి అజ్మీర్ దర్గాను దర్శించుకున్నాడు. అప్పటి నుంచే అతనికి ఇది సెంటిమెంట్ అయిందనే చెప్పచ్చు. లేటెస్ట్ గా తను నటించిన 'ఆగడు' చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగానే మహేష్ అజ్మీర్ దర్గాని సందర్శించి ప్రత్యేక పార్థనలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ‘ఆగడు’ విజయం సాధించాలని ఆయన ప్రార్థించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఆగడు మూవీలో తమన్నా ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రిన్స్‌తో మిల్క్ బ్యూటీ జతకట్టడం ఇదే మొదటిసారి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



